Please Remember, this page will be updated as and when some more information is received to me. Therefore, I request you please co-operate to me for sending any information that you have relating to the subject.
Here I have given the browser 11 font choises, in hopes that it will find one of them on the veiwer's system. They are: arial,courier new,comic sans,gill sons, georgia, helvetica, impact, times new roman, trebuchet, verdana, webdings
(13-16 are not in Original script)
Jump to section 3. అమరజీవి-అనభేరి, చందమామ పాట 17-40 చరణములు పేజీ 3Text for Section 2 goes here.
Booklet మొదటి ముద్రణ ( October, 2012) యొక్క Title పేజీ ఫోటో
Displaying the page of Booklet printed (JPG Image) with progress bar. NOTE : If image is not displayed, an alternative Text for Pg.1, will be displayed to viewers.
ముందుమాట :
కీ.శే. అనభేరి ప్రభాకరరావు గారు కరీంనగర్ జిల్లా, చిగురుమామిడి మండలం, పోలంపల్లిలో 15-8-1910 నాడు జన్మించారు. ఈయన నిజాం నవాబు పాలన నుండి తెలంగాణ విముక్తికై రణభేరిని మ్రోగించాడు. అప్పుడు జరిగిన సాయుధపోరాటంలో, రజాకార్ల మరియు నిజాం మిలిటరీపోలీసుల చేతిలో తన 13 మంది దళసహచరులతో పాటు, తేది. 14-3-1948 నాడు, మాందాపురం గుట్టపై వీరమరణం పొందినాడు. ఈయన కరీంనగర్ జిల్లాలో ప్రప్రథమ సాయుధదళనాయకుడు. ఆ సంఘటన వల్ల, గెరిల్లా పోరాట పద్ధతిని అనుసరించేందుకు కారణమైంది.
రచయిత్రి వివరాలు:
"అమరజీవి" అనభేరి ప్రభాకరరావు గారిపై 1948లో, ఆయన సతీమణి కీ.శే. అనభేరి సరళాదేవి గారు ఈ చందమామ పాటను రాసారు. ఇది ప్రప్రథమ ముద్రణ.
ముద్రణ వివరాలు
సేకరణ & డి.టి.పి .: డా. వెల్ముల కృష్ణారావు, ఇంటిపేర్ల పరిశోధకుడు, విశ్రాంత డిప్యూటీ అసిస్టెంట్ కమీషనరు ( S.T.).
ఫోన్: 7780733021, 912100621
e-mail : vkrao57gst@gmail.com
Website : nomasts.com & onomasts.in (Under development)
ప్రచురణ : రాధామాధవజీవన్ (రా.మా.జీ.) స్మారక కేంద్రం, పోస్ట్ & గ్రామం : తిరుమలాపురం (P.D.), వయా & మం. గొల్లపెల్లి ,
జి . కరీంనగరం 505 532 .
ప్రచురణ సంఖ్య : 2.
ప్రథమ ముద్రణ : అక్టోబర్ -2012 ,
ప్రతులు : 1000 . వెల : అమూల్యం .
ముద్రణ : ముగ్ధ ప్రింటింగ్ ప్రెస్ , రాజమండ్రి .
ముఖ్య గమనిక:
(ప్రస్తుతం పైన తెలిపిన నా వెబ్సైట్ నిర్మాణంలో వుంది. మీకు open కాదు.వెబ్సైట్ లేదు అనిగాని, error అనిగాని వస్తుంది. అందువల్ల, ఈ పాటకొరకు ఇంటర్నెట్ లో సెర్చ్ చేయవద్దు.)
ఈ పాటకొరకు, ఈ కింది లింకును నొక్కండి లేదా కింది లింకును కాపీ చేసి, గూగుల్ లో పేస్ట్ చేసి, సెర్చ్ చేయండి. సంబంధిత చందమామా పాట వున్న పేజీ మాత్రం ఓపెన్ అవుతుంది.
https://astonoms.in/Test-Files-HTML/Anabheri-Ranabheri-Chandamaama-Paata-by-A-Sarala-Devi-26-09-22.html
(NOTE : chiruthapatrikalu.com was my old domain and the code was written in HTML, CSS & JS.
My present new Domain name (onomasts.in) & new Link is given above. nomasts.com is also under development with WrodPress. (Updated on 16-10-2025))
(13-16 are not in Original script)
Text for Section 2 goes here.
Text for Section 3 goes here.
Text for Section 4 goes here.
4వ పేజి
మారు బల్కక సతి చందమామ మరి యిట్లుతలపోసె చందమామ 41
కానున్న కర్మంబు చందమామ కాకతీరున భువిలొ చందమామ 42
అనియిట్లు దుఖించి చందమామ అతివ వూర్కున్నది చందమామ 43
అన్నఅనుజుడు కూడ చందమామ వలదని నుడివిరి చందమామ 44
కన్నతండ్రికూడ చందమామ వలదని నుడివెను చందమామ 45
వారి కవుడు యిట్లు చందమామ వాదుగా బల్కెను చందమామ 46
జారత్వమునకయి చందమామ చోరత్వమునకయి చందమామ 47
నే వెళ్ళుచుంటినా చందమామ మీరేల వలదని చందమామ 48
నన్ను బల్కుట యిట్లు చందమామ న్యాయంబు గాదనె చందమామ 49
ధీరత్వమునకయ్యి చందమామ దేశసేవకునయ్యి చందమామ 50
నేవెళ్ళుచుండగా చందమామ ఈరీతి అనతగదు చందమామ 51
అనుచు వారికి జెప్పె చందమామ అతి హర్షముతోడ చందమామ 52
బాలకులు అప్పుడు చందమామ ఈతీరు బలికిరి చందమామ 53
బాపూజి మీరిట్ల చందమామ పయనమైతేయెట్లు చందమామ 54
మమ్మెవ్వరు జూతురు చందమామ మాస్థితి యెట్లనిరి చందమామ 55
శిశువుల కప్పుడు చందమామ చెప్పెనీరీతిగా చందమామ 56
చదువుచునుంటిరి చందమామ సచ్చరిత్రలు⁶ మీరు చందమామ 57
బుద్దునిచరితంబు చందమామ చదువలేద మీరు చందమామ 59
వీరబాలలయ్యు చందమామ వుండుడి మీరలు చందమామ 60
ధీరుని గర్భమున చందమామ ⁷ జన్మించి యున్నారు చందమామ 61
ధీరులయ్యి మీరు చందమామ జగతి వర్ధిల్లండి చందమామ 62
ఈరీతి బల్కుట చందమామ హితవుగాదని పలికె చందమామ 63
ప్రేమగల పెదతండ్రి చందమామ ప్రియమైన పినతండ్రి @ చందమామ 64
వారలే కలరని చందమామ వరనీతి బోధించె చందమామ 65
===============================
⁵ పస్పును, * దేశానికి స్వాతంత్ర్యం రాకముందు ఆయన ఆశించిందది .
⁶ సదుచరిత్రలు ⁷జన్మించినవారు, @ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పై ఆనాటి కుటుంబ సభ్యులకున్న నమ్మకమది .
Text for Section 2 goes here.
Pg.5
వెళ్ళె గృహమునుండి చందమామ ధీరుడా క్షణమందె చందమామ 66
ప్రతిజ్ఞ నెరవేర్చ చందమామ పయనమై వెళ్ళెను చందమామ 67
పదహారు మాసములు చందమామ అజ్ఞాతవాసియై చందమామ 68
పగలు రాత్రి గడపె చందమామ రాత్రి పగలు గడపె # చందమామ 69
ప్రజలకు జ్ఞానంబు చందమామ పరగదెల్పుచు వచ్చె చందమామ 70
రక్కసుని దాసులు చందమామ లావు భయభ్రాంతులై చందమామ 71
ప్రభాకరుండుంటె చందమామ మనప్రాణములు దక్కవని చందమామ 72
వెతకి వెతకి వాండ్లు చందమామ వెర్రివారైనారు చందమామ 73
పరమకిరాతకుడు చందమామ ప...(ఎడిట్)వాడు చందమామ 74
పార్టీల గలనని చందమామ పరగ నటనాజేసి చందమామ 75
గురులింగడనెవాడు చందమామ నైజాము గులాపు చందమామ 76
మిలటరి వారికి చందమామ ఈరీతి చూపెను చందమామ 77
ప్రభాకరుండిదె చందమామ పరగ ఇటువెళ్ళెనని చందమామ 78
మందాపురంబుకే చందమామ మార్గంబు చూపించే చందమామ 79
ఆ వూరిలో ధీరుండు చందమామ అన్నంబు దినుచుండ చందమామ 80
వచ్చె మిలటరియన చందమామ వెంటనే లేచిరి చందమామ 81
ఒక్కదళమువారు చందమామ మూడుచీలికలైరి చందమామ 82
దళనాయకుండపుడు చందమామ ధైర్యంబు వహియించి చందమామ 83
మూడుగంటలవరకు చందమామ ఘోర యుద్ధముజేసి చందమామ 84
వీరుండు అప్పుడు చందమామ ఉగ్రంబు దెచ్చుకొని చందమామ 85
బాంబు విసిరివేయ చందమామ మెండు రాతికి తగిలె చందమామ 86
హంతకులు అప్పుడు చందమామ గుండ్లు గురిపించిరి చందమామ 87
పాపిష్ఠి ఆ గుండు చందమామ పరమవీరుని అంటె చందమామ 88
వీరయోధుండంత చందమామ వీరస్వర్గము జేరె చందమామ 89
===========================
# సావనీర్లో శ్రీ దేశిని చినమల్లయ్యగారు వ్రాసిన “ అనభేరి ప్రభాకర రావు త్యాగనిరతి "
అనే వ్యాసంకూడా ఆయన రాత్రింబగల్లు పనిచేసిన విషయాన్నే ధృవీకరిస్తున్నది .
Text for Section 2 goes here.
Pg 6
శ్రీ సర్వజితు వత్సర చందమామ ఫాల్గుణమాసంబు చందమామ 90
శుద్ధచవితి రోజు చందమామ ఆదివారమునాడు చందమామ 91
అస్తమించినాడు చందమామ అమరజీవైనాడు% చందమామ 92
వీరుని మరణముకు చందమామ మేఘంబులుఱిమెను చందమామ 93
సూర్యచంద్రాదులు చందమామ చిన్నబోయినారు చందమామ 94
నక్షత్రములు కొన్ని చందమామ నేలపై రాలినవి చందమామ 95
ఆకాశ భూదేవి చందమామ రెండు యేకమయ్యి చందమామ 96
కారుచీకటి జేసె చందమామ & కాంతిగల జగతిని చందమామ 97
చూడవెళ్ళిన వాండ్ల చందమామ బూట్లచే గొట్టిరి చందమామ 98
వాండ్ల పైనబడి చందమామ వస్తువలు లాగిరి చందమామ 99
ధీరుని శవముతో చందమామ పదహారు శవములు చందమామ 100
పదిహేను శవములు చందమామ పయి బట్టలులాగిరి చందమామ 101
వీరుని ఒంటిపై చందమామ వస్త్రంబు ముట్టలే చందమామ 102
పెట్రోలుచేవారి చందమామ ముఖముల మాడ్చిరి చందమామ 103
నైజాం బంట్రోతు చందమామ నరరూప రాక్షసుడు చందమామ 104
% రచయిత్రి ఈ పాటకు ఏ పేరు పెట్టిందో నాకు తెలువదు. ఈ పాటను కొన్ని విడి కాగితాలపై వ్రాసింది. కావున, మొదటి పేజీ కూడా ఉందొ, లేదో తెలియని పరిస్థితి. మా మేనత్త గారు "అమరజీవైనాడు" అనే ఈ పద ప్రయోగం చేయటం వల్లనే, నేను ఈ పాటకు " అమరజీవి" - చందమామ పాట అనే పేరు ()ను పెట్టడం జరిగింది.
& ఇవి పురాగాథ వర్ణనలుగా, అతిశయోక్తిగా కనిపించినా, ఆయన చనిపోయిన సమయం సాయంత్రం 5 గంటలు. కావున వాతావరణంలో అలాంటి మార్పులు సహజం. పైగా , ఆయన మరణం పీడిత, తాడిత ప్రజానీకానికి, సహచరులకు, కుటుంబసభ్యులకందరికి దుఃఖకారణమే కదా ! ఇలాంటి మరికొన్ని విషయాలను “ శ్రీమతి అనభేరి సరళాదేవి గారి చందమామ పాట - చారిత్రక , సామాజిక మరియు భాషా విశేషముల పరిశీలన " అనే మరో వ్యాసంలో నేను వివరంగా చర్చించడం జరిగింది. నేను వ్రాసిన ఆ వ్యాసం చాలా పెద్దగా ఉన్నదని పత్రికా సంపాదకులు అన్నందున, ప్రచురణాభావం వల్ల, వారి సూచన మేరకు ఆ వ్యాసాన్ని చాలా వరకు కుదించాను. ఆ తర్వాత ప్రచురణకివ్వడం జరిగింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదువారి "వాజ్మయి", ఏప్రిల్-జూన్, 2008 సంచిక (వాల్యూం 10,నం.2)లో (పే.113 నుండి పే. 124 వరకు ) ఆ వ్యాసాన్ని ప్రచురింపబడింది .
Text for Section 2 goes here.
Pg.7
తాలూకదారనే # చందమామ త్రాగుబోతుగాడ్దె చందమామ 105
ఇన్నిదినములనుండి చందమామ మనకుదొర్కనివాడు చందమామ 106
మనచేతమృతిజెందె చందమామ మనకేమిపర్వయని చందమామ 107
అనుచు అప్పుడు వాడు చందమామ హంతకుల గూడియు చందమామ 108
నివాసముచేరిరి చందమామ నిండు సంభ్రము పడుచు చందమామ 109
నైజాం నాజీలు చందమామ నరరూప రాక్షసులు చందమామ 110
తెల్లవారకముందె చందమామ మల్లి గట్టుకు చేరి చందమామ 111
పదహారు శవముల చందమామ పరగ చితిని పేర్చి చందమామ 112
పదిబండ్ల కర్రలు చందమామ పైనుండి వేసిరి చందమామ 113
పూర్తి భస్మము జేసి చందమామ పరమకిరాతులు చందమామ 114
కల్లు వేళాయెనని చందమామ కరీంనగర్ జేరిరి చందమామ 115
# ఆవూరి ప్రజలంత చందమామ అతి దుఃఖముతోను చందమామ 116
ఇటువంటి వీరుని చందమామ ఎన్నడు గనలేదు చందమామ 117
నరరూపమునగల చందమామ నారాయణుండని చందమామ 118
ఎన్నడు ఎరుగము చందమామ ఈ ఘోర వింతలు చందమామ 119
మానవుల మందరము చందమామ మన ప్రభాకరునకు చందమామ 120
జగతియుండు వరకు చందమామ జోహారులిత్తాము చందమామ 121
ప్రజలుబల్కిరి యిట్లు చందమామ పరమ దుఃఖముతోను చందమామ 122
అంతలో నైజాము చందమామ అతిఘోర కల్లోలములు చందమామ 123
మానవుల బాధలు చందమామ మరిహెచ్చు ఆయెను చందమామ 124
అంతలో యూనియను చందమామ ఆలకించెనపుడు చందమామ 125
Text for Section 2 goes here.
పేజి 8
బాపుజీ అడుగులు చందమామ బాగుగా నడచేటి చందమామ 126
జహ్వరుడు శీఘ్రంబే చందమామ శుభరోజు చూచియు చందమామ 127
రథమును నడిపించే చందమామ నైజాము పైకిని చందమామ 128
వెంటనే ఉస్మాను చందమామ వ్యసనంబు జెందెను చందమామ 129
సంప్రతింపులు అంటే చందమామ సాగనివ్వకపోతి చందమామ 130
కాశీము రజ్వేడి చందమామ కాలమెట్లాయెనని చందమామ 131
ఒక్క నిమిషంబులో చందమామ యూనియన్లో చేరె చందమామ 132
జయము నీకు తండ్రి చందమామ జయము భారతపుత్ర చందమామ 133
శతవత్సరంబులు చందమామ ఆయువు నీకయ్య చందమామ 134
జహ్వరుడనీకు చందమామ జగతియందుచాల చందమామ 135
మా [హస్త అంజలులు] చందమామ ⁹మాతచే చేకొమ్ము చందమామ 136
ఈ పాట ఎవరైన చందమామ విన్న ఖేదముగల్గు చందమామ 137
పురుషులు వింటేను చందమామ పౌరుషంబుగల్గు చందమామ 138
అతివలు వింటెను చందమామ అతిరోషముగల్గు చందమామ 139
పాడిన వారలకు చందమామ పాట వినువారలకు చందమామ 140
పరమ దుఃఖముగల్గు చందమామ పరమ వీరునిగూర్చి చందమామ 141
సూర్య చంద్రాదులు చందమామ వున్నంత వరకు చందమామ 142
అగ్నియు జలములు చందమామ వున్నంత వరకు చందమామ 143
వుర్మిలో ఈపాటవుండ చందమామ దైవమును ప్రార్థింతు చందమామ 144
పండితు లెవరైన చందమామ పరమజ్ఞానులైన చందమామ 145
తప్పులు వున్నను చందమామ దయచేసి దిద్దుడు చందమామ 146
వాసి పోలంపల్లి¹⁰ చందమామ వరశివుని కృపచేత చందమామ 147
సెలవయ్య నాకిక చందమామ చెప్పితిని అంతయు చందమామ 148
ఈ చిన్ని పాటయు చందమామ ఏ. సులోచన జెప్పె చందమామ 149
¹¹భాసిల్లె చరితము చందమామ బాలికల వలనను చందమామ 150
======================
⁸ [హస్త అంజలులు] : సంధి వల్ల హస్తాంజలులు అని వుండవలిసింది. కానీ, ఉన్నదున్నట్లుగా అలాగే ఉంచడం వల్ల [ ] గుర్తు sic తో సూచించడం జరిగింది.
⁹ మాతృచే కొమ్ము , ¹⁰ పౌరి , ¹¹ బాసిల్లె
మాందాపురం అమర వీరులపై నాకు సమాచారం అందించుటకు లేదా ఈ విషయంగా అందరము కలిసి ఒక పుస్తకం వెలువరించుటకు ఇష్టమైనవారి సహకారం కొరకు ఒక విజ్ఞప్తి
వివిధ పుస్తకాలను పరిశీలించి చేసిన విషయ సేకరణతో,కీ.శే.అనభేరి ప్రభాకరరావు గారిపై ఒక Monographను గతంలో నేను రాజమండ్రిలో వున్నప్పుడు కొంత వ్రాయడం జరిగింది. నా ఉద్యోగ విరమణ అయినందున,మరికొన్ని గ్రంథాలను పరిశీలించి,దీనిని నేను పూర్తి చేయాల్సి వుంది.అందువల్ల,ఇందుకు సంబంధించిన వివరాలు మీ వద్ద ఏమైనా ఉంటే , దయచేసి నా మెయిల్ కు పంపగలరని కోరి, ప్రార్థిస్తున్నాను.
మరియు,ఇందులో అనభేరి సరళాదేవి గారి మిగతా రచనల వివరాలను కూడా చేర్చ బడతాయి.ఎవరైనా కృతిభర్తల ద్వారా,దీనిని పుస్తక రూపేణా (offline) ఫిబ్రవరి, 2022 వరకు తేవాలని నా సంకల్పం.అంతేగాకుండా,సామాన్య జనులకు అందుబాటుగా ఉండేందుకa onomasts.com & onomasts.in (under development) అనే నా websiteద్వారా కూడా అశేష ప్రజాబాహుళ్యంలోకి తేవాలని నా ప్రయత్నం.
2) కీ.శే అనభేరి సరళా దేవి గారి "అమరజీవి - అనభేరి" చందమామ పాట అనే శీర్షికతో గతంలో ఒక వ్యాసాన్ని"వాజ్మయి" (త్రైమాససిక పత్రిక),పొ.శ్రీ.తె.వి.వి.,హైదరాబాద్, ఏప్రిల్-జూన్,2008, సంచిక (పే.113-124)లో ప్రచురించడం జరిగింది.
రాజమండ్రి ఇంటిపేర్లపై పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం, బొమ్మూరులో, నేను Ph.D చేస్తున్న కాలంలో,ఈ పాట లోని భాషా చారీ త్రిక,సామాజిక,సాహిత్య విషయాలు, వ్యక్తిత్వ చిత్రణ,పాత్రపోషణ, రసవిచారము,లేఖన విశేషములు వంటి అనేక విషయాలతో ఒక సవివర వ్యాసాన్ని నేను వ్రాయడం జరిగింది. స్థలాభావం వల్ల, ఆ వ్యాసాన్ని సంక్షిప్తపరిచి,వాజ్మయి పత్రికలో అప్పుడు ప్రచురించడం జరిగింది.ఆ తర్వాత,ఆ పాటను మాత్రమే ఒక bookletగా అక్టోబర్,2012లో ప్రచురించడం జరిగింది.
డా. వెల్ముల కృష్ణా రావు, ఇంటిపేర్ల పరిశోధకుడు,డిప్యూటీ అసిస్టెంట్ కమీషనర్ (S.T,),నూజివీడు,(Rtd.), Ph.7780733021, 9121006021 ఇమెయిల్. vkrao57gst@gmail.com